Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ద్రావకం పోసేందుకు యువకుడి యత్నం
అడ్డుకున్న భద్రతా సిబ్బంది..;
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై దాడి యత్నం జరిగింది. గ్రేటర్ కైలాస్ ఏరియాలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తుండగా దగ్గరగా వచ్చిన ఓ యువకుడు ద్రావకం పోసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకున్నారు. అయితే ఆ సరికే ద్రావకం చుక్కలు కొన్ని ఆయన దుస్తులపై పడ్డాయి. ఆప్ కార్యకర్తలు నిందితుడిని పట్టుకున్న వెంటనే పోలీసులకు అప్పగించారు.
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. లిక్విడ్ పోసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ దాడి యత్నం జరిగింది. దాడి చేయాలని ప్రయత్నించిన వ్యక్తికి పోలీసులు, ఆప్ కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. కేజ్రీవాల్‌పై ఎలాంటి లిక్విడ్ విసిరారో తెలియరాలేదు.
కేజ్రీవాల్‌పై దాడి గురించి ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడారు. ‘‘బీజేపీ నేతలు అన్ని రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వారిపై ఎప్పుడూ దాడులు జరగలేదు. కేజ్రీవాల్‌పై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. బీజేపీ ఆయనపై దాడి చేసింది. నంగ్లోయ్‌పై ఛతర్‌పూర్‌లో దాడి జరిగింది. ఢిల్లీలో శాంతిభద్రతలు కుప్పకూలాయి.కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రి ఏం చేయడం లేదు’’ అని అన్నారు.