Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన మావోలు.. రెండ్రోజులుగా..
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన మావోలు ఇప్పటి వరకు అతన్ని విడిచిపెట్టలేదు.;
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన మావోలు ఇప్పటి వరకు అతన్ని విడిచిపెట్టలేదు. ఇంద్రావతి వంతెన వద్ద నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ అశోక్ పవార్‌ను మావోలు కిడ్నాప్ చేశారు. రెండు రోజులైనా ఆచూకీ తెలియకపోవడంతో అశోక్ పవార్ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. తన భర్తపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉందని, కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తున్నాడు తప్ప ఎలాంటి కీడు చేయలేదని.. అశోక్ పవార్ భార్య సోనాలి చెబుతోంది. తన భర్తకు ఏ హానీ కలిగించకుండా విడుదల చేయాలని మావోలను వేడుకుంటోంది. కావాలంటే ఊరు వదిలి వెళ్లిపోతామని మొరపెట్టుకుంటోంది.