Kanpur: భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం

షూ ఫ్యాక్టరీలో ఘోరం;

Update: 2025-05-05 01:45 GMT

కాన్పూర్‌లోని చమన్ గంజ్ ప్రాంతంలో లెదర్ ఫ్యాక్టరీ ఉన్న ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు లోపల చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఐదు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదే భవనంలో నివాసం ఉంటున్న దంపతులు, వారి ముగ్గురు కుమార్తెలు మూడవ-నాల్గవ అంతస్తులో చిక్కుకున్నారు.

మూడవ అంతస్తులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని సెంట్రల్ డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు. పిల్లల బెడ్ రూములు నాల్గవ అంతస్తులో ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు SDRF వారిని రక్షించిందని తెలిపారు. పది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News