LGBTQ MP: దేశంలోనే తొలి ఎల్‌జీబీటీక్యూ ఎంపీ మేనక..!

రాజ్యసభకు ఎల్‌జీబీటీక్యూ మేనకా గురుస్వామి.. అభ్యర్థిగా ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్... అందరి దృష్టిని ఆకర్షించిన మేనకా ఎంపిక

Update: 2026-02-28 15:00 GMT

పశ్చిమ బెం­గా­ల్‌ రా­జ­కీ­యా­ల్లో కీలక పరి­ణా­మం చో­టు­చే­సు­కుం­ది. రా­బో­యే రా­జ్య­సభ ఎన్ని­కల నే­ప­థ్యం­లో అధి­కార పా­ర్టీ తృ­ణ­మూ­ల్ కాం­గ్రె­స్‌ (టీ­ఎం­సీ) తమ అభ్య­ర్థుల జా­బి­తా­ను ప్ర­క­టిం­చిం­ది. ఈ జా­బి­తా­లో రా­జ­కీయ, పరి­పా­లన, న్యాయ, సినీ రం­గా­ల­కు చెం­దిన ప్ర­ము­ఖు­ల­కు చోటు కల్పిం­చ­డం వి­శే­షం. ము­ఖ్యం­గా సు­ప్రీం­కో­ర్టు సీ­ని­య­ర్‌ న్యా­య­వా­ది మే­న­కా గు­రు­స్వా­మి పే­రు­ను ప్ర­క­టిం­చ­డం దే­శ­వ్యా­ప్తం­గా చర్చ­నీ­యాం­శ­మైం­ది. ఆమె ఎన్ని­కై­తే భారత పా­ర్ల­మెం­ట్‌ చరి­త్ర­లో తొలి ఎల్‌­జీ­బీ­టీ­క్యూ ప్ర­తి­ని­ధి­గా ని­లి­చే అవ­కా­శం ఉంది. సమా­న­త్వం, రా­జ్యాంగ వి­లు­వల పరి­ర­క్షణ కోసం సా­గిన ఆమె పో­రా­టం ఇప్పు­డు రా­జ­కీయ రంగ ప్ర­వే­శం­తో మరో మై­లు­రా­యి­ని తా­క­బో­తోం­ద­ని వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. దే­శ­వ్యా­ప్తం­గా మొ­త్తం 37 రా­జ్య­సభ స్థా­నా­ల­కు మా­ర్చి 16న ఎన్ని­క­లు జర­గ­ను­న్నా­యి. పశ్చిమ బెం­గా­ల్‌­లో ఐదు స్థా­నా­లు ఖాళీ అవు­తు­న్నా­యి. రా­ష్ట్ర అసెం­బ్లీ­లో ఉన్న బలం దృ­ష్ట్యా నా­లు­గు స్థా­నా­లు తృ­ణ­మూ­ల్ కాం­గ్రె­స్ ఖా­తా­లో­కి వె­ళ్లే అవ­కా­శా­లు స్ప­ష్టం­గా కని­పి­స్తు­న్నా­యి. మి­గి­లిన ఒక స్థా­నం బీ­జే­పీ­కి దక్కే అవ­కా­శం ఉంది. ఈ నే­ప­థ్యం­లో టీ­ఎం­సీ ప్ర­క­టిం­చిన నలు­గు­రు అభ్య­ర్థు­లు—రా­ష్ట్ర మం­త్రి బా­బు­ల్ సు­ప్రి­యో, మాజీ డీ­జీ­పీ రా­జీ­వ్ కు­మా­ర్, సు­ప్రీం­కో­ర్టు సీ­ని­య­ర్ న్యా­య­వా­ది మే­న­కా గు­రు­స్వా­మి, ప్ర­ముఖ నటి కో­య­ల్ మల్లి­క్. ఈ వి­ష­యా­న్ని పా­ర్టీ అధి­కా­రిక ‘ఎక్స్’ వే­ది­క­గా ప్ర­క­టిం­చిం­ది.

ఈ జాబితాలో మేనకా గురుస్వామి పేరు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయ రంగంలో విశేష అనుభవం కలిగిన ఆమె, రాజ్యాంగ హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన న్యాయవాది. 2018లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పులో భాగస్వామిగా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అదే ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేసిన తీర్పు. ఈ సెక్షన్ ప్రకారం స్వలింగ బంధాలను నేరంగా పరిగణించేవారు. దానిని సవాలు చేసిన పిటిషన్లలో మేనకా గురుస్వామి కీలక వాదనలు వినిపించారు. ఆమె సహా పలువురు న్యాయవాదుల వాదనలతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని, స్వలింగ సంబంధాలను నేరం కింద పరిగణించే చట్టాన్ని కొట్టివేసింది. ఈ తీర్పు భారతదేశంలో ఎల్‌జీబీటీక్యూ హక్కులకు ఒక నూతన దిశను చూపింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో మేనక కూడా ఒకరు.

Tags:    

Similar News