Assam: ప్రేమను నిరూపించుకోవడానికి అలాంటి పనిచేసిన బాలిక.. షాక్‌లో నెటిజన్లు..
Assam: ప్రేమకు వయసుతో పనిలేదు అంటుంటారు. కానీ ప్రేమ అసలైన అర్థం ఏంటో కూడా తెలియని వయసులోనే కొందరు ప్రేమలో పడుతున్నారు.;
Assam: ప్రేమ గురించి చెప్పాలంటే ఎన్ని మంచి విషయాలు ఉంటాయో.. అంతకంటే ఎక్కువ విమర్శించే విషయాలు కూడా ఉంటాయి. ఈ ప్రేమ అనేది ఒక్కొక్కసారి మనుషులను విచక్షణ కోల్పోయేలా కూడా చేయవచ్చు. అందుకే ప్రేమ గుడ్డిదని, ప్రేమలో, యుద్ధంలో ఏదైనా సమ్మతమే అని ఏదేదో చెప్తుంటారు. తాజాగా ఓ మైనర్ బాలిక చేసిన ప్రేమ కోసం పని చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
ప్రేమకు వయసుతో పనిలేదు అంటుంటారు. కానీ ప్రేమ అంటే అసలైన అర్థం ఏంటో కూడా తెలియని వయసులోనే కొందరు ప్రేమలో పడుతున్నారు. అస్సాంలోని సువల్‌కూచి ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక కూడా అలాగే చేసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమయిన ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. అంతే కాకుండా తనకోసం తల్లిదండ్రులను వద్దనుకొని పలుమార్లు పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ ఇంట్లోవాళ్లు మందలించి తిరిగి తీసుకొచ్చారు.
ఇంతలోనే తన బాయ్‌ఫ్రెండ్‌కు ఎయిడ్స్ అన్న విషయాన్ని తెలుసుకుంది బాలిక. అది తన ప్రేమకు పరీక్ష అనుకుంది. అందుకే తన ప్రేమను నిరూపించుకోవడం కోసం ఏకంగా తన బాయ్‌ఫ్రెండ్ రక్తాన్ని తన శరీరంలో ఇన్‌జెక్ట్ చేసుకుంది. ఇది తన ప్రాణాలకు ఎంత ప్రమాదం అన్న విషయం మాత్రం తను గ్రహించలేకపోయింది. ఈ వార్త నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. తనపై, తన తల్లిదండ్రులపై కామెంట్స్‌లో ఫైర్ అవుతున్నారు కొందరు.
What ???????? pic.twitter.com/5VSTrgnkic
— Saba🔪 (@abeyyarsun) August 7, 2022