HARYANA: నిన్న నూహ్‌.. నేడు గురుగ్రామ్‌

మత ఘర్షణలతో అట్టుడుకుతున్న హరియాణ... రంగంలోకి కేంద్ర బలగాలు.. కుట్ర కోణం దాగుందన్న సీఎం...

Update: 2023-08-02 01:30 GMT

రెండు వర్గాల మధ్య ఘర్షణ(Communal Clashes )తో హరియాణా (Haryana) అట్టడుకుతోంది. నూహ్‌ పట్టణం(Haryana's Nuh )లో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు క్రమంగా వేరే ప్రాంతాలకు పాకుతున్నాయి. నూహ్‌ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే తాజాగా అల్లర్ల ప్రభావం పక్కనున్న గురుగ్రామ్‌ (Gurugram) జిల్లాపైనా పడింది. గురుగ్రామ్‌లోని బాద్షాపూర్‌ ఏరియా(Badshahpur )లో ఘర్షణలు చెలరేగాయి. దాదాపు 100 నుంచి 200 మంది వరకు( mob of around 200) ఉన్న అల్లరి మూకల గుంపు బైకులపై వచ్చి బాద్షాపూర్‌లోని దుకాణాలకు, వాహనాలకు నిప్పుపెట్టింది.


గురుగ్రామ్‌(Gurugram )లో కొన్ని అల్లరిమూకలు వివాదాస్పద నినాదాలు చేస్తూ బాద్‌షాపుర్‌లోని ఓ రెస్టారెంట్‌(Mob Burns Restaurant‌)తోపాటు దుకాణానికి నిప్పంటించారు. ఈ ఘటన నూహ్‌ జిల్లాలో అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతానికి కేవలం 40కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో తీవ్ర కలకలం రేపింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 70(sector 70 in Gurugram)లో ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారుల్లో కొందరు ఓ మందిరంపై కాల్పులకు పాల్పడ్డారు. అనంతరం ఆ ప్రాంతానికి నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వెల్లడించారు. ఘర్షణలను అదుపు చేసేందుకు 13 కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకోగా మరో 6 కంపెనీల బృందాలను రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


 కర్రలు, రాళ్లతో ఆయుధాలతో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మాంసం దుకాణాలతో సహా చాలా షాపులను ధ్వంసం చేశారని, కొన్నింటికి నిప్పు పెట్టారని వాపోయారు. దుకాణం, గుడిసెలకు నిప్పు పెట్టారని, పుకార్లను నమ్మవద్దని గురుగ్రామ్‌ ACPవరుణ్ కుమార్ దహియా‍ (ACP Crime Varun Kumar Dahiya‌) విజ్ఞప్తి చేశారు, గురుగ్రామ్‌లో వాహన రాకపోకలపై నిషేధం లేదని ఇంటర్నెట్ కూడా పని చేస్తోందని తెలిపారు.

మరోవైపు నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. హరియాణాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని.... సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టంచేశారు. ఘర్షణల్లో ఆయుధాలు, బుల్లెట్లు దొరకడం చూస్తుంటే దీని వెనక కుట్ర కోణం దాగి ఉంటుందని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ అనుమానం వ్యక్తం చేశారు. ఘర్షణల కారణంగా నూహ్ సహా పలు చోట్ల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇవాళ కూడా నూహ్ , ఫరీదాబాద్‌లలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఘర్షణలు తలెత్తకుండా నూహ్ , సోహ్నా జిల్లాల్లో రెండు వర్గాలకు చెందిన పెద్దలతో అధికారులు శాంతి కమిటీలు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News