Uttar Pradesh: త‌ల్లి, న‌లుగురు చెల్లెళ్ల‌ను హ‌త్య చేసిన యువ‌కుడు

ల‌క్నోలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి హత్య;

Update: 2025-01-01 06:00 GMT

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో దారుణం జ‌రిగింది. ఓ హోట‌ల్‌లో త‌న త‌ల్లితో పాటు న‌లుగురు చెల్లెళ్ల‌ను హ‌త్య చేశాడు ఓ యువ‌కుడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని నాకా ప్రాంతంలో ఒక హోటల్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. ‘‘ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకారం నిందితుడిని 24 ఏళ్ల అర్షద్‌గా గుర్తించాం. ఒక హోటల్‌ గదిలో అతడు తన తల్లి, 19,18,16,9 ఏళ్ల వయసున్న నలుగురు చెల్లెళ్లను హత్య చేసినట్లు స్థానికుల నుంచి సమాచారం వచ్చింది. ఘటనాస్థలంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం’’ అని సెంట్రల్ లఖ్‌నవూ డీసీపీ వెల్లడించారు. ఆ కుటుంబానిది ఆగ్రా అని, వారు ఆ హోటల్‌కు ఎందుకు వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. కుటుంబంలో నెలకొన్న గొడవల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా వెల్లడవుతోందని తెలిపారు. మృతుల శరీరాలపై గాయాలున్నట్లు పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని తెలిపారు.

Tags:    

Similar News