Parliament : పార్లమెంటు ఆవరణలో విపక్షాల నిరసన.. ధరలను తగ్గించాలని ప్లకార్డుల ప్రదర్శన
Parliament : విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ గాంధీ విగ్రహం ఆందోళన చేపట్టారు.;
Parliament : విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ గాంధీ విగ్రహం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో టీఆర్‌ఎస్ ఎంపీలు సైతం పాల్గొన్నారు. రాజ్యసభ నుంచి 19 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెరిగిన ధరలు, జీఎస్టీ విధింపు, పెట్రోల్, గ్యాస్ ధరలపై ప్రశ్నించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.
దేశ ప్రజలను దోచుకోవడం ఆపండి అంటూ విపక్ష ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్లేట్‌లో అన్నం, అన్నం కుండతో నిరసనకు దిగారు. పెరిగిన ధరలతో జనం అల్లాడుతుంటే.. చర్చకు కనీసం అవకాశం ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.