Noida: నోయిడాలో మొబైల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, 2 కోట్ల విలువైన ఫోన్ లు స్వాధీనం
ముఠాలోని డానిష్, ఫిరోజ్, ఫర్దీన్ ,సలీం అనే నలుగురు సభ్యుల అరెస్ట్
ఢిల్లీలోని నోయిడాలో మొబైల్ దొంగతనాలు మరియు చోరీలకు పాల్పడుతున్న ఒక ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ముఠాలోని డానిష్, ఫిరోజ్, ఫర్దీన్ ,సలీం అనే నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.
ఢిల్లీలోని నోయిడాలో మొబైల్ దొంగతనాలు మరియు చోరీల చేస్తున్న నిందితుల ముఠాను పట్టుకున్నారు ఢిల్లీలోని నోయిడా పోలీసులు. అయితే నిందితులు డానిష్, ఫిరోజ్, ఫర్దీన్ ,సలీంలను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి 2 కోట్లకు పైగా విలువైన 60 ఐఫోన్లు, 28 ఐప్యాడ్‌లు, 10 ఇతర మొబైల్ ఫోన్లు , 265 మొబైల్ విడిభాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో పాటు పరిసర జిల్లాల్లో ఈ ముఠా 500కు పైగా మొబైల్ దొంగతనాలు, పలు చోరీల కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే.. నిందితులు మారువేషంలో ఉండి, మద్దతుదారులు లేదా భక్తులుగా నటిస్తూ జనంలో కలిసిపోయేవారని పోలీసులు వెల్లడించారు. ఈ సమయంలో, వారు ఖరీదైన, అధునాతన ఐఫోన్లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించేవారు. దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు, వాటి విడిభాగాలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని పోలీసులు వెల్లడించారు.
దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల నుండి విడిభాగాలను తీసి డిమాండ్ మేరకు ప్రధాన నిందితుడు డానిష్ సరఫరా చేసేవాడని పోలీసులు తెలిపారు.. ఈ వ్యాపారం ముఠాకు గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టింది. నిందితుడి నుండి పోలీసులు 60 ఐఫోన్లు, 10 మల్టీమీడియా మొబైల్ ఫోన్లు, 28 ఐప్యాడ్‌లు, ఒక టాబ్లెట్, 265 మొబైల్ విడిభాగాలు, ఒక ఆపిల్ టీవీ పరికరం మరియు ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.