Madhya Pradesh: అందరూ చూస్తుండగా యువతి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

మధ్యప్రదేశ్‌ ఆస్పత్రిలో దారుణం;

Update: 2025-07-01 04:30 GMT

 మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని నార్సింగ్‌పూర్ ఆస్ప‌త్రిలో దారుణ‌మైన మ‌ర్డ‌ర్ జ‌రిగింది. ప‌ట్ట‌ప‌గ‌లే ఓ అమ్మాయిని గొంతు కోసి చంపేశాడు. ఈ ఘ‌ట‌న జూన్ 27వ తేదీన ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో జ‌రిగింది. మృతురాలు 19 ఏళ్ల సంధ్యా చౌద‌రీ. ఆమె 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ది. అభిషేక్ కోస్తి అనే వ్య‌క్తి ఆమెను హ‌త్య‌ చేశాడు. అమ్మాయి గొంతు కోస్తున్న వీడియో ఒక‌టి సోమ‌వారం వైర‌ల్ అయ్యింది. విద్యార్థినిపై దాడి చేస్తున్న స‌మ‌యంలో ఆస్ప‌త్రి సిబ్బంది, పేషెంట్లు అక్క‌డే ఉన్నా..వారేమీ అడ్డుకోలేక‌పోయారు. ఆస్ప‌త్రి ఫ్లోర్‌పైనే ర‌క్త స్త్రావం జ‌రిగి ఆమె ప్రాణాలు విడించింది.

ఆస్ప‌త్రికి చేరుకున్న సంధ్య‌ను అభిషేక్ కొట్టాడు. ఆమెను నేల‌కు ప‌డేశాడు. ఆమె ఛాతిపై కూర్చుని, త‌న వ‌ద్ద ఉన్న క‌త్తితో ఆమె గొంతు కోసేశాడు. ఎమ‌ర్జెన్సీ వార్డు స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌మీపంలోనే డాక్ట‌ర్లు, గార్డులు ఉన్నా.. ఆ మ‌ర్డ‌ర్‌ను అడ్డుకోలేక‌పోయారు. ప‌ది నిమిషాల్లోనే ఇదంతా జ‌రిగిపోయింది. నిందితుడు కూడా త‌న గొంతు కోసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ఆ త‌ర్వాత అత‌ను అక్క‌డ నుంచి బైక్ తీసుకుని ప‌రారీ అయ్యాడు.

ఆస్ప‌త్రిలో భ‌ద్ర‌త లేక‌పోవ‌డంతో.. ఆ మ‌ర్డ‌ర్ ఘ‌ట‌న అక్క‌డ ఉన్న వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసింది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు భ‌యంతో త్వ‌ర‌త్వ‌ర‌గా డిశ్చార్జ్ అయ్యారు. ఆ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సంధ్య ఆస్ప‌త్రికి చేరుకున్న‌ది.  నల్ల చొక్కా ధరించిన అభిషేక్, తెల్ల షర్ట్ వేసుకున్న సంధ్య రూమ్ నెంబర్ 22 వెలుపల మాట్లాడుకున్నారు. అనంతరం సంధ్యను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే నేలకేసి విసిరాడు. అటు తర్వాత ఆమె ఛాతీపై కూర్చుని గొంతు కోశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొబైల్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాదాపు ఈ ఘటన 10 నిమిషాల పాటు జరిగింది. విచిత్రమేంటంటే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వారితో పాటు వార్డు బాయ్‌లు, వైద్యులు, నర్సులు కూడా ఉన్నారు. కానీ ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనతో ఆస్పత్రిలో రోగులు, బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు డిశ్చార్జ్ అయిపోయారు. భారీగా రక్తస్రావం కావడంతో సంధ్య అక్కడే చనిపోయింది. ఉదయం చనిపోతే.. మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటి వరకు మృతదేహం అలానే ఉంచారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags:    

Similar News