Petrol And Diesel Price: 5 నెలల తర్వాత పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు.. ఎంతంటే.?

Petrol And Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు..

Update: 2022-03-22 01:46 GMT

Petrol And Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగాయి. దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. గతేడాది నవంబర్‌ తర్వాత పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో ధరలను పెంచడం అనివార్యమైనట్లు తెలుస్తోంది.

కొన్ని నెలలకు ముందు భారత్‌లో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 10 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయలు చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించడంతో వినియోగదారులకు భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ. 94. 62గా ఉంది. ఇవాల్టి నుంచి పెంచిన ధరలతో పెట్రోలు ధర రూ.109.10, డీజిల్‌ 95.49కు చేరింది.

Tags:    

Similar News