Pm Modi: బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ

డబుల్ ఇంజిన్‌తోనే రాష్ట్రానికి మేలు అన్న ప్రధాని

Update: 2026-04-09 08:45 GMT

బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. హల్దియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోయారని గుర్తు చేశారు. ఈసారి రాష్ట్రమంతా అదే ఫలితం వస్తుందని అన్నారు. ఇప్పుడు భవానీపూర్‌లో (మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు) కూడా అదే ఫలితం వస్తుందని అన్నారు.

ఈ ఎన్నికలు బెంగాల్ అభివృద్ధికి, బెంగాల్ చరిత్రను తిరగరాయడానికి ఉపయోగపడే ఎన్నికలు అన్నారు. భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధి విషయంలో అడ్డుపడుతోందని విమర్శించారు. ప్రైవేటు రంగాల్లో సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ మోసాలు ప్రజల ముందు ఉంచుతామని మోదీ పేర్కొన్నారు.

బెంగాల్ యువతను తృణమూల్ కాంగ్రెస్ ఎంతో మోసం చేసిందని, ఆ పాపాలు ఊరికే పోవని హెచ్చరించారు. బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రాగానే కేంద్ర పథకాలు ఇక్కడ అమల్లోకి వస్తాయని హామీ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్యాయాలు, కుంభకోణాలపై విచారణ జరిపి, కారకులైన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. శరణార్థులకు ఆశ్రయమిస్తామని, కానీ చొరబాటుదారులను తరిమికొడతామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News