Bengaluru Fridge Case : బెంగళూరు మహిళ హత్యలో ప్రేమ కోణం .

అనుమానం వ్యక్తం చేసిన భర్త;

Update: 2024-09-24 03:45 GMT

బెంగళూరులో మహిళ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. మహాలక్ష్మీ అనే వ్యక్తిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టారు. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. నిందితుడిని గుర్తించినట్టుగా ఇప్పటికే పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ హత్యపై తాజాగా మహాలక్ష్మీ భర్త హేమంత్ దాస్ స్పందించాడు.

 ఈ హత్యలో ఉత్తరాఖండ్‌కు చెందిన ఆమె ప్రేమికుడు ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసినట్టుగా ఇండియా టుడే పేర్కొంది. హేమంత్ దాస్ దాస్ ఇప్పటికే అతడి గురించి పోలీస్ స్టేషన్‌లో చాలా నెలల క్రితం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.'నేను అతనిపై ఒకసారి నెలమంగళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు తర్వాత అతను బెంగళూరుకు రాకూడదని ఆదేశాలు వచ్చాయి. కానీ వారు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు.' అని హేమంత్ దాస్‌ చెప్పాడు.

29 ఏళ్ల మహిళను నరికి ఫ్రిజ్‌లో ముక్కలుగా చేసి పెట్టిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానంద సోమవారం తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ప్రధాన నిందితుడిని గుర్తించామని, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటించారు.

బాధితురాలు మహాలక్ష్మీ మల్లేశ్వరంలోని ఓ మాల్‌లో పనిచేస్తుంది. తన భర్తకు దూరంగా జీవిస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని గుర్తించడానికి 4-5 రోజుల ముందు నేరం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త కూడా సంఘటనా స్థలానికి వచ్చాడు. మరోవైపు, ఘటనా స్థలిలో బాధితురాలు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్విచ్ఛాప్‌లో ఉండటంతో ఆమె ఆఫ్ చేశారా? లేదా హత్య తర్వాత నిందితులు అలా చేశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఆమె కాల్ రికార్డ్‌లు, సోషల్ మీడియా యాక్టివిటీ, వాట్సాప్ చాట్‌లను పోలీసులు సమీక్షిస్తున్నారు. తదుపరి విశ్లేషణ కోసం దానిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపే యోచనలో ఉన్నారు. నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని  అన్నారు.

Tags:    

Similar News