Prashant Kishor: బిహార్ సీఎం నితీశ్ వాగ్దానాలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు..
Prashant Kishor: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వాగ్దానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిశోర్.;
Prashant Kishor: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వాగ్దానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మహాగఠ్ బంధన్ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలిచ్చినా.. బిహార్‌లో తాను ప్రచారాన్ని ఆపేస్తానన్నారు. 'జన్ సురాజ్ అభియాన్'ను ఉపసంహరించుకొని నితీశ్‌కు మద్దతు ప్రకటిస్తానని తెలిపారు.
స్వాతంత్ర్య వేడుకల్లో మాట్లాడిన సీఎం నితీశ్ కుమార్.. రెండేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. ఆ కామెంట్లకు కౌంటరిచ్చారు పీకే. ఇక ముఖ్యమంత్రి పదవి కోసం ఇతర పార్టీలన్నీ తంటాలు పడుతుంటే.. నితీశ్ మాత్రం ఫెవికాల్ వేసుకుని మరీ కుర్చీకి అతుక్కుని కూర్చున్నారని సెటైర్ వేశారు పీకే. ప్రశాంత్ కిశోర్ గతంలో జేడీయూలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా సైతం వ్యవహరించారు.
తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ ఆయనపై వేటు వేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. హస్తం పార్టీ కూడా ఆయనకు ఆహ్వానం పలికింది. కానీ, ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన పీకే.. బిహార్ రాజకీయాలపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగానే 'జన్ సురాజ్ అభియాన్' పేరిట కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబరు 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.