పీరియడ్స్ లో ఉన్న విద్యార్థిని క్లాస్ రూమ్ బయట పరీక్ష రాయించిన ప్రిన్సిపల్.. సస్పెండ్

రుతుక్రమంలో ఉన్న దళిత విద్యార్థిని తరగతి గది బయట కూర్చోబెట్టి పరీక్షలు రాయించిన ప్రిన్సిపల్ వార్త వైరల్ కావడంతో ఆమెపై సస్పెండ్ వేటు పడింది.;

Update: 2025-04-11 10:32 GMT

రుతుక్రమంలో ఉన్న దళిత విద్యార్థిని తరగతి గది బయట కూర్చోబెట్టి పరీక్షలు రాయించిన ప్రిన్సిపల్ వార్త వైరల్ కావడంతో ఆమెపై సస్పెండ్ వేటు పడింది. 

తమిళనాడులోని కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని రుతుక్రమం కారణంగా తరగతి గది వెలుపల పరీక్షలు రాయవలసి వచ్చింది. దళిత బాలిక తరగతి గది మెట్లపై కూర్చున్న వీడియో విస్తృతంగా ప్రచారం కావడంతో అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. దీనిపై విచారణకు ఆదేశించగా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.


Tags:    

Similar News