మధ్యప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ హామీల వర్షం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల హామీలు గుప్పించారు;
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల హామీలు గుప్పించారు. జబల్‌పూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె.. కర్ణాటక తరహాలోనే ఐదు హామీలను ప్రకటించారు. రైతుల రుణాలు మాఫీ చేయడంతో పాటు, రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నర్మదా నదీ తీరం సాక్షిగా హామీలను అమలు చేస్తామన్నారు. బీజేపీ నాయకుల్లా తాము అబద్ధాలు చెప్పే వాళ్లం కాదన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ గురించి మాట్లాడుతుంది కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చదని ప్రియాంక మండిపడ్డారు.