CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు తీవ్ర అస్వస్థత
వైద్యులు ఏమన్నారంటే
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆస్పత్రిలో చేరారు. గత రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పర్యటనకు రద్దు అయ్యింది.
కేబినెట్ సమావేశం వాయిదా..
పంజాబ్‌లో వరద పరిస్థితికి సంబంధించి ఈ సాయంత్రం చండీగఢ్‌లోని పంజాబ్ సీఎం హౌస్‌లో జరగనున్న ముఖ్యమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని సీఎం ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో వరదల గురించి చర్చించాల్సి ఉంది. ఆయన గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కానీ ఈరోజు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, వెంటనే ఆయనను ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీఎం ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు.
గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఆయన తన పర్యటనలో చాలా మంది ప్రజలు కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది ప్రజలు వారి ఇళ్లను వదిలి వెళ్లడానికి ఇష్టపడటం లేదని, వారికి గ్రామంలోనే సహాయం అందిస్తున్నామని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేస్తున్నారని అన్నారు.
గత కొన్ని రోజులుగా పంజాబ్‌లో కురుస్తున్న భారీ వర్షాల రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.అనేక జిల్లాలు ఇప్పటికి వరదల గుప్పిట్లో ఉన్నాయి. ప్రజలకు సహాయం అందించడానికి సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రదేశాలకు, సహాయక శిబిరాలకు తరలించారు. వరదల కారణంగా చాలా మంది మరణించారని పలు నివేదికలు పేర్కొన్నాయి.