Punjab: పోలీస్ స్టేషన్ లో అవినీతికి వ్యతిరేకంగా హోమ్ గార్డు నిరసన
జలంధర్ జాతీయ రహదారిపై హోంగార్డు నిరసన;
మనం నిజాయితీగా ఉంటే కాదు అందరూ కోరుకున్నాడు ఓ హోంగార్డు. తన సహోద్యోగుల అవినీతిని చూసి నిజాయితీ గల ఓ తట్టుకోలేకపోయారు. చెప్పి చెప్పి విసిగిపోయి హైవేపై నిరసనకు దిగారు. పంజాబ్‌లోని జలంధర్ లో తాజాగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తను ఎంతో కష్టపడి తాను దొంగలను అరెస్ట్ చేయటం మిగిలిన పోలీసులు డబ్బులు తీసుకొని ఆ దొంగలను బయటకు వదిలేయడం చూసి చూసి ఆ హోమ్ గార్డ్ కి వళ్ళు మండిపోయింది. ‘నేను ఎంతో కష్టపడి దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్ లోని వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు’ అంటూ భోగ్‌పూర్ ప్రాంతంలో పఠాన్ కోట్ హైవేపై హోంగార్డు నిరసనకు తెరలేపాడు.
ముందు రహదారికి అడ్డంగా ఓ తాడు కట్టి ట్రాఫిక్ వెళ్లేందుకు మార్గం లేకుండా చేస్తూ నిరసనకు దిగాడు. మరో పోలీసు అతడిని అడ్డుకోవడంతో ఈమారు రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకున్నారు. హోంగార్డు నిరసనతో అక్కడ కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ క్రమంలో అతడిని మరో పోలీసు కాలితో తన్నాడన్న ఆరోపణ కూడా ఉంది. హోంగార్డు ఆరోపణలపై హోంపూర్ స్టేషన్ ఇంచార్జి స్పందించారు ఓ వివాదానికి సంబంధించి హోంగార్డు ఓ యువకుడిని అరెస్టు చేసి స్టేషన్కు తీసుకు వచ్చాడని అయితే అతనిని బెయిల్ పైనే విడుదల చేశామని. డబ్బులు తీసుకుని విడుదల చేయటం అన్నది నిరాధార ఆరోపణ అని చెప్పారు.