J&K Assembly Elections: జమ్మూ&కాశ్మీర్లో నేడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం..
రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్న లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత;
లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ రోజు (సోమవారం) జమ్మూ అండ్ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారు. కాంగ్రెస్, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం 11 గంటలకు పూంచ్‌లోని సురాన్‌కోట్ కు చేరుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి షానవాజ్ చౌదరికి మద్దతుగా ఆయన పబ్లిక్ ర్యాలీలో పాల్గొంటారు. షానవాజ్ చౌదరి ఏఐసీసీ కార్యదర్శిగా, ఒడిశా కో-ఇన్‌చార్జిగా కూడా పని చేస్తున్నారు.
ఇక, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా షానవాజ్ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా, రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లోని సురాన్ కోటలోనూ ఈరోజు పర్యటిస్తారు. షాల్టెంగ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన సభా ప్రదేశానికి చేరుకుంటారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికల్లోనూ బనిహాల్‌లోని సంగల్దాన్, సౌత్ కశ్మీర్‌లోని దూరు ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ ప్రచారం చేశారు. రెండో విడత పోలింగ్‌కు ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 25వ తేదీన పోలింగ్ జరుగనుంది.