Rahul Gandhi: కుటుంబంతో రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేసిన రాహుల్ గాంధీ

ఎన్నికల బిజీ తర్వాత తొలిసారి ఫ్యామిలీతో రెస్టారెంట్ వెళ్లిన గాంధీ కుటుంబం..;

Update: 2024-12-23 00:30 GMT

లోక్‌సభ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల వరకు, ఆ తర్వాత పార్లమెంటు సమావేశాల్లో ఎంతో బిజీగా కనపడ్డారు కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ. ప్రస్తుతం కాస్త సమయం దొరకడంతో వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇవాళ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం క్వాలిటీ రెస్టారెంట్‌లో పలు రకాల వంటకాలను రుచిచూసింది. ఈ ఫొటోలను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


రాహుల్, ప్రియాంక వెంట వారి తల్లి సోనియా గాంధీ, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరాయా వాద్రా, ఆమె అత్తయ్య కూడా ఉన్నారు. అనేక మంది నెటిజర్లు లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. రాహుల్ గాంధీ తన స్టేటస్‌కి ఫోటోలు ఉంచుతూ.. ఐకానిక్ క్వాలిటీ రెస్టారెంట్‌లో ఫ్యామిలీ లంచ్ అంటూ రాశారు. ‘‘మీరు వెళితే చోలే భాతురే ప్రయత్నించండి అంటూ సలహా కూడా ఇచ్చారు. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉండే ఈ క్వాలిటీ రెస్టారెంట్‌కి స్వాతంత్య్రం ముందు నుంచి ఉంది. అనేక దశాబ్ధాలుగా రెస్టారెంట్ మల్టీ-కాంటినెంట్ వంటలకు ప్రసిద్ధి చెందింది. ఈ రెస్టారెంట్‌లో వడ్డించే చోలే-బతురే ఎక్కువగా అమ్ముడవుతున్న ఫుడ్ ఐటెం.

రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక రాయ్ బరేలీ, వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News