Rajnath Singh: ఎన్నికల ప్రచారంలో 'పుష్ప' డైలాగ్.. రాజ్‌నాథ్ సింగ్ అంటే ఫైర్ అంటూ..
Rajnath Singh: టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ''పుష్ప'' చిత్రం డైలాగ్‌లు హాట్‌టాఫిక్‌గా మారాయి.;
Rajnath Singh: టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ''పుష్ప'' చిత్రం డైలాగ్‌లు హాట్‌టాఫిక్‌గా మారాయి. ఇటు తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లోనూ పుష్ప సినిమా ఓ కుదుపు కుదిపేస్తోంది. తాజాగా ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ నేతల నోట 'పుష్ప' మాట వినిపిస్తోంది. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుష్ప సినిమా ప్రస్తావన చేస్తూ, సీఎం పేరు కూడా పుష్కర్ సింగ్ అంటూ పోలిక తెచ్చారు.
గంగోలిహట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో ప్రసగించిన రాజ్‌నాథ్ సింగ్..పుష్ప సినిమాలాగే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ థామి సింపుల్‌గా, సౌమ్యంగా ఉంటారన్నారు. పుష్కర్ థామిలో పువ్వూ ఉంది, నిప్పూ ఉందని.. ఆయనను ఎవరూ ఆపలేరన్న రాజ్‌నాథ్‌సింగ్....థామి తగ్గేదే లేదంటూ చమత్కరించారు.