IPL 2025: హెడ్ యాడ్‌పై ఆర్సీబీ కేసు
‘ఉబర్’ను హైకోర్టుకు ఈడ్చిన ఆర్సీబీ;
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ నటించిన యాడ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కేసు నమోదు చేసింది. ఇటీవల ప్రముఖ క్యాబ్ సర్వీసింగ్ కంపెనీ ఊబర్ ఇండియాతో హెడ్ యాడ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్స్‌లో తమను అవమానించడంతో పాటు కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
యాడ్ ఏంటంటే..
ఈ యాడ్‌లో హెడ్ మరో వ్యక్తితో కలిసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోకి చొరబడినట్లుగా చూపించారు. ఆ తర్వాత అక్కడ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ అని రాసి ఉన్న బోర్డుపై.. రాయల్లీ ఛాలెంజెడ్ బెంగళూరు అని పెయింట్ చేస్తాడు. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతని వెంట పడగానే.. అతడు ఊబర్ బైక్ బుక్ చేసుకొని అక్కడి నుంచి పారిపోతాడు.