Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో మంత్రికి మరో నాలుగు రోజులు జైలు..
Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మంత్రి సత్యేందర్ జైన్... మరో నాలుగు రోజులు జైల్లోనే ఉండనున్నారు.;
Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్... మరో నాలుగు రోజులు జైల్లోనే ఉండనున్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో ఈ నెల 18 వరకు జైలు జీవితం గడపనున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న స్పెషల్ కోర్టు న్యాయమూర్తి.. ఉత్తర్వులు ఈనెల 18కి వాయిదా వేశారు.
కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మే 30న సత్యేందర్ జైన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2015-15లో హవాలా నెట్‌వర్క్ ద్వారా షెల్ కంపెనీల నుంచి జైన్ కంపెనీలకు సుమారు 4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. దీంతో సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన 4.81 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.