Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో పోలుస్తూ ట్వీట్..
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.;
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత రాత్రి తనకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందినట్లు శరద్ పవార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది తనకు అందిన ప్రేమ లేఖంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2004, 2009, అలాగే 2014, 2020 ఎన్నికల సమయంలో తాను వేసిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు.
అయితే తాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పూర్తి సమాచారం తనదగ్గర ఉందన్నారు. తమ అధినేతకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై ఎన్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కక్షసాధింపేనంటూ ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసుల మాదిరిగానే.. తమ అధినేతకు ఐటీ నోటీసులు ఇచ్చారని మండిపడుతున్నారు. దీని వెనుక కుట్ర ఉందంటూ బీజేపీపై మండిపడుతున్నారు.