Shiva Sena : శివసేన విల్లు-బాణం గుర్తును స్తంభింపజేసిన ఎలక్షన్ కమిషన్..
Shiva Sena : శివసేనకు 1989లో శాశ్వత పార్టీ గుర్తుగా విల్లు-బాణాన్ని కేటాయించింది ఎలక్షన్ కమిషన్;
Shiva Sena : శివసేన విల్లు-బాణం గుర్తును ఎలక్షన్ కమిషన్ స్తంభింపజేయడంతో..త్వరలో జరగబోయే అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక కోసం మూడు పేర్లు, పార్టీ గుర్తులతో ఈసీకి జాబితా అందించింది ఉద్ధవ్ థాక్రే వర్గం. ఈ జాబితాలో పార్టీ పేరుగా శివసేన బాలాసాహెబ్ థాక్రేను మొదటి ఛాయిస్‌గా ఎంచుకుంది. రెండో ఛాయిస్‌గా శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే పేరును ఎంచుకుంది. శివసేన ప్రబోధన్‌కర్ థాక్రే పేరును మూడో ఛాయిస్‌గా పెట్టింది. ఇక పార్టీ గుర్తులుగా త్రిశూలం, చేతిలో కాగడ, ఉదయించే సూర్యుడును ఛాయిస్‌గా పెట్టుకుంది. ఈ మేరకు ఉద్ధవ్ వర్గం జాబితా అందించిందని ఈసీ వర్గాలు తెలిపాయి.
తమ పార్టీ పేరు శివసేన అని అన్నారు ఉద్ధవ్ వర్గం నేత, ఎంపీ అరవింద్ సావంత్. ప్రతిపాదించిన మూడు పేర్లలో ఈసీ తమకు ఏ పేరు కేటాయించిన సమ్మతమేనన్నారు. పార్టీ గుర్తుగా త్రిశూల్, ఉదయించే సూర్యుడు, కాగడను ఎంచుకున్నామన్నారు. దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
మరోవైపు తమకు మెజార్టీతో పాటు అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయన్నారు షిండే వర్గం నేతల, మంత్రి దీపక్ కేసార్కర్. తమ వర్గానికి న్యాయంతో పాటు విల్లు-బాణం గుర్తు కూడా దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ రెండున్నరేళ్ల పాలనలో మహారాష్ట్రకు చేసిందేమి లేదన్నారు. ప్రజలు వారికి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ బద్ధ సంస్థ అని..దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
శివసేనకు 1989లో శాశ్వత పార్టీ గుర్తుగా విల్లు-బాణాన్ని కేటాయించింది ఎలక్షన్ కమిషన్. అంతకుముందు వివిధ రకాల గుర్తులపై ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చింది. ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో విల్లు-బాణం గుర్తును ఎలక్షన్ కమిషన్ శనివారం స్తంభింపజేసింది. ప్రత్యామ్నాయంగా రెండు వర్గాలకు ఇష్టమున్న మూడు పేర్లు, గుర్తులతో కూడిన జాబితాను తమకు అందించాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. వీటిలో నుంచి ఒక పేరును, గుర్తును ఆయా వర్గాలకు ఈసీ కేటాయించనుంది.