Supreme Court : ఆయన పేరునే సిఫారసు చేసిన సీజేఐ ఎన్‌.వి. రమణ..

Supreme Court : సుప్రీంకోర్టుకు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేరును సిఫార్సు చేశారు సీజేఐ ఎన్‌.వి.రమణ

Update: 2022-08-04 07:45 GMT

Supreme Court : సుప్రీంకోర్టుకు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టేందుకు జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేరును సిఫార్సు చేశారు సీజేఐ ఎన్‌.వి.రమణ. జస్టిస్‌ లలిత్‌ పేరును సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

సీజేఐ ఎన్‌.వి.రమణ స్వయంగా జస్టిస్‌ లలిత్‌కు సిఫారసు లేఖ కాపీని అందజేశారు. తదుపరి సీజేఐగా ఎవరుండాలో సిఫారసు చేయాల్సిందిగా న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయానికి లేఖ రాశారు. ఈ లేఖకు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ రిప్లై ఇచ్చారు.

ఈనెల 26న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణ చేస్తున్నారు. ఆ తర్వాత జస్టిస్‌ లలిత్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే, జస్టిస్‌ లలిత్‌ పదవీకాలం కూడా తక్కువే. కేవలం 74 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవిలో ఉంటారు. ఈ ఏడాది నవంబర్‌ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ పదవీ విరమణ చేస్తారు.

Tags:    

Similar News