Arya Samaj: ఆర్యసమాజ్ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Arya Samaj: ఆర్యసమాజ్.. ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వస్తోంది.;
Arya Samaj: ఆర్యసమాజ్.. ప్రేమ పెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ వస్తోంది. పెద్దలు వ్యతిరేకిస్తే ప్రేమికులు ఆర్యసమాజ్‌కు వెళ్లి శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకునేవారు. ఆర్యసమాజ్ ఇచ్చే వివాహ సర్టిఫికేట్లకు గుర్తింపు ఉండేది. అయితే తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్యసమాజ్ వివాహాలను గుర్తించబోమని తీర్పు వెలువరించింది. ఆర్యసమాజ్ పెళ్లి సర్టిఫికేట్లను గుర్తించబోమని పేర్కొంది. పెళ్లిళ్లు చేయడం ఆర్యసమాజ్ పనికాదని తేల్చి చెప్పింది.