Nupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు చెప్పాలంటూ..
Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.;
Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదమ్ పూర్ ఘటనకు నుపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని అభిప్రాయపడింది. దేశ ప్రజలకు ఆమె కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో జరుగుతున్న మత అల్లర్లకు నుపుర్ శర్మే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది.
నుపుర్ శర్మ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తనపై దేశవ్యాప్తంగా వేరు వేరుప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐ ఆర్‌లను క్లబ్ చేసి.. ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపాలని కోరుతూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శర్మ అభ్యర్ధనను తోసిపుచ్చిన ధర్మాసనం.. పై విధంగా స్పందించింది. దీంతో ఆమె తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.