Supreme Court: ఆస్పత్రుల్లో భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ : సుప్రీంకోర్టు

10 మంది సభ్యులతో ఏర్పాటు;

Update: 2024-08-20 07:00 GMT

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను సుమోటోగా తీసుకుని వాచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. మహిళలు, యువ వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యుల భద్రత కోసం 10 మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు.ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం, బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వంపై విరుచుకుపడింది. ఇదిలా ఉంటే డాక్టర్లు, ఆస్పత్రుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో తుది నివేదికను సమర్పించాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్)ని ఆదేశించినట్లు కోర్టు పేర్కొంది. 

10 మందితో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్‌కు నావికాదళానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ నాయకత్వం వహిస్తారు. ఆమెతో పాటు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి మరియు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ కూడా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో నిమ్మాన్స్ బెంగళూర్ నుంచి డాక్టర్ ప్రతిమా మూర్తి, ఎయిమ్స్ జోధ్ పూర్ నుంచి డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, ఢిల్లీ గంగారామ్ హాస్పిటన్ నుంచి డాక్టర్ సోమిక్రా రావత్ , ప్రముఖ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ పల్లవి సావ్లే, గుర్గావ్ లోని పారిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పద్మ శ్రీ వాస్తవ సభ్యులుగా ఉన్నారు.

Tags:    

Similar News