Supreme Court: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసుల్ని క‌ర్నాట‌క‌కు బ‌దిలీ చేసిన సుప్రీంకోర్టు

కేసు విచారణకు తగినంత సమయం ఇవ్వాలని తెలిపిన సుప్రీంకోర్టు;

Update: 2025-01-06 07:30 GMT

వివిధ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ కేసుల‌ను.. క‌ర్నాట‌క హైకోర్టుకు బ‌దిలీ చేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. మొబైల్ ఫోన్ల అమ్మ‌కాల విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆ రెండు సంస్థ‌ల‌పై కాంపిటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా ఆరోప‌ణ‌లు చేసింది.

పలు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ కేసుల‌ను కర్ణాటక హైకోర్టుకు బ‌దిలీ చేయాల‌ని ఈరోజు ( జనవరి 6) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్ల అమ్మకాల విష‌యంలో అక్రమాలకు పాల్పడినట్లు కాంపిటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా చేసిన ఆరోప‌ణ‌ల‌ను స‌వాల్ చేస్తూ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ సంస్థలు పలు న్యాయస్థానాల్లో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, సీసీఐ వేసిన పిటీష‌న్ ఆధారంగా జ‌స్టిస్ అభ‌య్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ద్విసభ్య ధ‌ర్మాస‌నం ఈ-కామ‌ర్స్ సంస్థల కేసుల‌ను కర్ణాటకకు పంపింది. ఒక‌వేళ ట్రాన్స్‌ఫ‌ర్ అయిన పిటీష‌న్ల కేసుల్లో విచార‌ణ పూర్తి కాకపోతే, వాళ్లకు తగినంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు వెల్లడించింది.

కాగా, సీసీఐ ఆరోప‌ణ‌ల‌ను స‌వాల్ చేస్తూ సుమారు 26 పిటీష‌న్లు వేర్వేరు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉండటంతో.. అన్నింటినీ కలిపి కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై ఢిల్లీ వ్యాపార మ‌హా సంఘం కంప్లైంట్స్ చేసింది. దాని ఆధారంగా సీసీఐ విచార‌ణ కొనసాగించింది. అయితే, సీసీఐ ఇచ్చిన రిపోర్టును త‌ప్పుప‌డుతూ.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు న్యాయస్థానాల్లో వేర్వేరుగా పిటీష‌న్లు దాఖ‌లు చేశాయి.

Tags:    

Similar News