Swiggy Statistics 2021: అయితే బిర్యానీ.. లేదా సమోసా.. ఈ రెండింటికే అందరి ఓటు..
Swiggy Statistics 2021: ప్రతీ సంవత్సరం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. ఒక స్టాటిస్టిక్స్ రిపోర్డ్‌ను రెడీ చేస్తుంది.;
Swiggy Statistics 2021: మామూలుగా మనం రెస్టారెంట్‌కు వెళ్తే ఏం చేస్తాం? ముందు మెనూ కార్డ్ చూస్తాం. కార్డ్ అంతా ఒకసారి చదువుతాం. ఆ తర్వాత..? మనం ఎప్పుడూ తినే బిర్యానీనే ఆర్డర్ చేస్తాం. ప్రతీసారి తినే బిర్యానీనే అయినా.. ఎప్పటికప్పుడు దాని టేస్ట్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. సాయంత్రం అవ్వగానే ఆకలేసిందంటే ఛాయ్‌తో పాటు సమోసా కూడా ఉండాల్సిందే అనుకునేవారు చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పటికీ, ఎప్పటికీ ఇవే భారతదేశంలోని చాలామందికి ఫేవరెట్. అదే విషయాన్ని స్విగ్గీ కూడా వెల్లడించింది.
ప్రతీ సంవత్సరం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. ఒక స్టాటిస్టిక్స్ రిపోర్డ్‌ను రెడీ చేస్తుంది. ఇందులో తమ యాప్‌లో ఏ ఐటెమ్‌ను ఎక్కువ ఆర్డర్ చేశారు, ఏ రెస్టారెంట్‌కు ఎక్కువగా ఆర్డర్స్ వచ్చాయి.. లాంటి చాలా వివరాలే ఉంటాయి. అయితే ఇందులో భాగంగా 2021లో వచ్చిన స్టాటిస్టిక్స్ రిపోర్డ్ ప్రకారం బిర్యానీనే ఎక్కువమంది ఆర్డర్ చేసే డిష్‌గా నెంబర్ 1 స్థానంలో నిలిచింది.
2021లో స్విగ్గీకి నిమిషానికి 115 మంది బిర్యానీ ఆర్డర్ చేశారట. అంటే సెకనుకు కనీసం ఇద్దరు బిర్యానీని ఆర్డర్ చేస్తున్నారన్నమాట. ఇక స్నాక్స్ విషయానికి వస్తే.. నెంబర్ 1 ప్లేస్‌లో సమోసా ఉందట. దాని తర్వాత పావ్ భాజినే అందరు ఇష్టపడే స్నాక్‌గా ప్లేస్ సంపాదించుకుంది. స్వీట్స్‌లో మాత్రం గులాబ్ జామ్, రసమలైను ఎక్కువ ఆర్డర్ చేశారని వెల్లడించింది స్విగ్గీ. అయితే బిర్యానీకి నెంబర్ 1 ప్లేస్ రావడం ఇది ఆరోసారి.