Uttar Pradesh : లాకర్‌లో ఉంచిన రూ.18 లక్షలకు చెదపురుగులు
కూతురి పెళ్లి కోసం ఉంచిన 18 లక్షల రూపాయల నోట్లు చెదల పాలు..;
నగదు, నగలు, విలువైన పత్రాలను మనం బ్యాంక్ లాకర్‌లో దాచుకుంటాం. అలాగే ఆమె కూతురి పెళ్లి కోసమని రూపాయి రూపాయి కూడబెట్టి బ్యాంక్ లాకర్ లో ఉంచింది. అయితే చిన ఓ మహిళ.. కొన్ని నెలల తర్వాత డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఆమెకు ఊహించని సీన్‌తో ఒక్కసారిగా షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ మహిళ తన కుమార్తె పెళ్లి కోసం పొదుపు చేసిన రూ.18 లక్షలను బ్యాంకు లాకర్‌లో ఉంచింది. చాలా రోజుల తర్వాత లాకర్‌ని తెరవగానే ఆమెకు షాకింగ్ సీన్ కనిపించింది. లాకర్‌లో ఉన్న డబ్బుకు పెద్ద మొత్తంలో చెదలు పట్టేసింది. ఈ ఘటన మొరాదాబాద్‌లోని ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో చోటుచేసుకుంది.
యూపీలో కూతురు పెళ్లి కోసం ఓ మహిళ బ్యాంకు లాకర్‌లో ఉంచిన 18 లక్షల రూపాయల నోట్లకు చెదపురుగులు పట్టాయి. కరెన్సీ నోట్లు అసలు పనికి రాకుండా చెదపురుగులు కొరికివేశాయి. యూపీలోని మొరాదాబాద్‌లో దాదాపు ఏడాదిన్నర పాటు బ్యాంకు లాకర్‌లో రూ.18 లక్షల నగదును ఉంచిన ఓ మహిళ తన డబ్బుకు చెదపురుగులు సోకిందని గుర్తించింది. లాకర్ వార్షిక నిర్వహణ, కేవైసీ ధృవీకరణ కోసం ఆల్కా పాఠక్ ను మేనేజర్ బ్యాంక్ కు పిలిపించారు. మహిళ లాకర్ ను తెరిచి చూడగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆల్కా వెంటనే బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌కి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్యాంకులో ఆందోళన మొదలైంది. బ్యాంక్ లాకర్‌లో నగదుతోపాటు విలువైన వస్తువులను భద్రపరచడానికి అవసరమైన నిర్దిష్ట పరిస్థితుల గురించి తనకు తెలియదని అల్కా అంగీకరించారు. ఈ పద్ధతిలో నిల్వ చేయలేమని తెలియకపోవడంతో డబ్బును డిపాజిట్ చేసినట్లు ఆమె వెల్లడించారు.
లాకర్‌లో నిల్వ ఉంచిన వస్తువులకు నష్టం వాటిల్లిందని, బ్యాంకు నిర్లక్ష్యం, చీడపీడల నివారణ చర్యలు చేపట్టకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 20 నుంచి 25 లాకర్లు చెదపురుగుల బారిన పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, విచారణ జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని సీనియర్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ యాదవ్ తెలిపారు. నష్టం గురించి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు ధృవీకరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని బ్యాంకు తెలిపింది.