Namansh Syal : సూలూర్ ఎయిర్‌బేస్‌కు వింగ్ కమాండర్ భౌతికకాయం
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తమిళనాడుకు
దుబాయ్ ఎయిర్ షో లో ఫైటర్ జెట్ కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ , వింగ్ కమాండర్ నామాన్ష్ స్యాల్ భౌతికకాయం తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూర్ లోని సూలూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని తమిళనాడుకు తరలించారు.
అక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్యాల్ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు. అక్కడ భారత వాయుసేన అధికారిక లాంఛనాలతో స్యాల్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదవశాత్తు ఆయన మరణించారు.
ఎయిర్ షోలో భాగంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా.. భారత వాయుసేనకు చెందిన తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ఆ జెట్ నడుపుతున్న ఎయిర్ ఫోర్స్ పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ దుర్మరణం పాలయ్యారు.