Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీ కాలం పొడిగింపు..
ఉత్వర్వులు జారీ చేసిన కేంద్రం;
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీకాలాన్ని జూలై 14, 2026 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి విక్రమ్ మిస్రీ జూలై 15న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. విక్రమ్ మిస్రీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.
మిస్రీ 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, కేబినెట్ నియామకాల కమిటీ మిస్రీ పదవీకాలాన్ని నవంబర్ 30 నుండి జులై 14, 2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు పొడిగించింది. FR 56 (D) నిబంధనల ప్రకారం ఈ పదవి కాలం పెంపు ఆమోదించబడింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ తేదీకి మించి కూడా విదేశాంగ కార్యదర్శి సేవలను పొడిగించేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయని అధికారులు తెలిపారు. విక్రమ్ మిస్రీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అనేక పదవుల్లో పనిచేశారు. గతంలో యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలోని భారతీయ మిషన్లలో వివిధ హోదాల్లో పని చేశారు.