Puja Khedkar: పూజా ఖేద్కర్‌ శిక్షణ నిలుపుదల

పూణె కలెక్టర్ పై పోలీసులకు పూజా ఖేద్కర్ ఫిర్యాదు;

Update: 2024-07-17 00:15 GMT

గత కొంత కాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అడ్డదారుల్లో ఆమె ఐఏఎస్‌ ఉద్యోగం సంపాదించారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ట్రైనీ ఐఏఎస్‌గా మహారాష్ట్రలో వెంటనే శిక్షణను నిలిపివేసి జూలై 23లోపు తిరిగి ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆడ్మినిస్ట్రేషన్‌కు వెనక్కి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పుణే కలెక్టర్‌ తనను వేధిస్తున్నారని ఖేద్కర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఆమె పోలీసులకు.. పూణె కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది. పూణె కలెక్టర్ సుహాస్‌ దివాసే తనను వేధిస్తున్నాడని పూజా కంప్లంట్ చేసింది. పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పూణె కలెక్టర్ సుహాస్ దివాసే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆమెను పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. అనంతరం ఆమెపై వరుసగా ఆరోపణలు వెలువెత్తాయి. చదువు దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ల వరకు అన్ని నకిలీ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం.. ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఐఏఎస్‌ ప్రొబేషన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్న ఆరోపణలతో సర్కార్ ఈ యాక్షన్ తీసుకుంది. తాజాగా ఆమె పూణె కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఇంకా ఏ దిశగా సాగుతుందో చూడాలి.

 

Tags:    

Similar News