గ్రామస్థులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు మృతి, ఐదుగురికి గాయాలు..
యూపీలోని భోపత్‌పూర్ గ్రామలో వేగంగా వెళ్తున్న ట్రక్కు గ్రామస్థులపైకి దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.;
భోపట్‌పూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న పికప్ ట్రక్కు గ్రామస్థులపైకి దూసుకెళ్లడంతో నలుగురు వ్యక్తులు మరణించారు, మరో ఐదుగురు గాయపడ్డారు. మూలాల ప్రకారం, అధిక వేగంతో నడుపుతున్న ట్రక్ రోడ్డు పక్కన కూర్చున్న నలుగురిని ఢీకొట్టింది. దాంతో లీలాధర్ (60), ధరమల్ (40), ఓంపాల్ (32), పురన్ సింగ్ (45) అక్కడికక్కడే మృతి చెందారు.
అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు గ్రామస్తులు గాయపడ్డారు.. వారు నిరంజన్ (30), జమున సింగ్ (60), గంగాప్రసాద్ (55), ఓంప్రకాష్ (50), మరియు నాలుగేళ్ల అవదేశ్. వారిని వెంటనే సిహెచ్‌సి రాజ్‌పురాకు తరలించి అనంతరం అలీగఢ్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.