Encounter : జర్నలిస్ట్‌ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు షూటర్లు మృతి..!

షూటర్లపై ఒక్కొక్కరిపై రూ.లక్ష రివార్డు;

Update: 2025-08-07 03:15 GMT

ఉత్తరప్రదేశ్‌ సీతాపూర్‌కు చెందిన జర్నలిస్ట్‌ రాఘవేంద్ర బాజ్‌పాయ్‌ హత్య కేసులో ఇద్దరు షూటర్లు హతమయ్యారు. పోలీసులకు, షూటర్లకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. పోలీసు తూటలకు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హత్య కేసులో షూటర్లపై ఒక్కొక్కరిపై రూ.లక్ష రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మహోలికి చెందిన జర్నలిస్ట్‌ రాఘవేంద్ర జాజ్‌పాయ్‌ హత్య కేసులో వాంటెడ్‌ క్రిమినల్స్‌ అయిన సంజయ్‌ తివారీ, రాజు తివారీ, పోలీసులకు మధ్య గురువారం ఉదయం పిసావాన్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యలు చనిపోయినట్లు ప్రకటించారు.

ఘటనపై ఎస్పీ అంకూర్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ మహోలీ రోడ్‌లో పోలీసులు, ఎస్‌టీఎఫ్‌ సంయుక్త బృందంగా ఇద్దరి కోసం గాలింపు జరుపుతుండగా.. షూటర్లు సంజయ్‌ తివారీ, రాజు తివారీ బైక్‌పై వెళ్తున్నారని.. వారిని అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులపై కాల్పు జరిపారన్నారు. పోలీసులు సైతం కాల్పులు జరుపగా.. గాయాలకు గురయ్యారన్నారు. వారిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మరణించారని ప్రకటించారన్నారు. ఇద్దరిపై హత్యాయత్నం, హత్యలతో పాటు అనేక తీవ్రమైన కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది మార్చి 8న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హేంపూర్‌ వంతెన వద్ద ఇద్దరు షూటర్లు జర్నలిస్ట్‌ రాఘవేంద్ర కాల్చి చంపారు. పోలీసులు ఈ కేసును 34 రోజుల్లోగా ఛేదించి ఓ పూజారి, మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో ఇద్దరు షూటర్లు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. హత్యలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని.. ఇందులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News