US: వలసదారుల కంటే H-1B ఉద్యోగులే ప్రమాదం?

దుమారం రేపుతున్న రాజకీయ వ్యాఖ్యాత మార్క్ మిచెల్‌

Update: 2025-12-13 09:30 GMT

అమెరికాకు చెందిన ప్రముఖ పోలింగ్ కంపెనీ రాస్‌ముస్సేన్‌ సీఈఓ, రాజకీయ వ్యాఖ్యాత మార్క్ మిచెల్‌, H-1B వీసాదారులపై, ముఖ్యంగా భారతీయ ఉద్యోగులపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక్క H-1B ఉద్యోగి 10 మంది అక్రమ వలసదారులతో సమానమని ఆయన పోల్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్‌ నిర్వహించిన కార్యక్రమంలో మిచెల్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "యాపిల్‌ వంటి టెక్ దిగ్గజాల వద్ద పనిచేసే ఒక్క H-1B ఉద్యోగి 10 మంది అక్రమ ఉద్యోగులతో ఆర్థికంగా సమానం. వీరంతా భారీగా సొమ్ము వెనకేసుకుంటున్నారు," అని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు తక్కువ వేతనాలకు పనిచేసే "థర్డ్ వరల్డ్ ఇంజినీర్లను" అమెరికన్ల స్థానంలోకి తీసుకువస్తున్నాయని, ఇది కేవలం "దోపిడీ" అని ఆయన ఆరోపించారు.

భా­ర­తీ­యు­లే లక్ష్యం: 'డీ-ఇం­డి­య­నై­జే­ష­న్' సలహా సం­స్థ ఏర్పా­టు­కు ప్ర­ణా­ళిక మి­చె­ల్ అక్క­సు కే­వ­లం వ్యా­ఖ్య­ల­కే పరి­మి­తం కా­లే­దు. అమె­రి­క­న్ కం­పె­నీ­ల­ను "డీ-ఇం­డి­య­నై­జే­ష­న్" చే­య­డం­లో సహా­య­ప­డేం­దు­కు ఒక కా­ర్పొ­రే­ట్ సలహా సం­స్థ­ను ప్రా­రం­భిం­చా­ల­ని తాను కో­రు­కుం­టు­న్న­ట్లు సో­ష­ల్ మీ­డి­యా వే­ది­క­గా ప్ర­క­టిం­చా­రు. "సి­లి­కా­న్ వ్యా­లీ శ్రా­మి­క­శ­క్తి­లో మూ­డింట రెం­డిం­త­లు వి­దే­శీ­యు­లే. కొ­న్ని సం­స్థ­లు 85-95 శాతం మంది భా­ర­తీ­యు­ల­నే ని­య­మిం­చు­కుం­టు­న్నా­యి" అని ఆయన చే­సిన వ్యా­ఖ్య­లు భా­ర­తీయ టె­క్‌ ఉద్యో­గు­ల­ను లక్ష్యం­గా చే­సు­కు­న్న­ట్లు స్ప­ష్ట­మ­వు­తోం­ది.

2025 ఇం­డ­స్ట్రీ ఇం­డె­క్స్‌ గణాం­కాల ప్ర­కా­రం, సి­లి­కా­న్ వ్యా­లీ­లో­ని 66 శాతం టె­క్‌ ఉద్యో­గా­ల్లో వి­దే­శీ­యు­లే ఉన్నా­ర­ని, అం­దు­లో 23 శాతం మంది భా­ర­తీ­యు­లు, 18 శాతం మంది చైనా జా­తీ­యు­లు ఉన్నా­ర­ని తే­లిం­ది. అయి­తే, మొ­త్తం అమె­రి­క­న్ శ్రా­మిక శక్తి­లో H-1B వీ­సా­దా­రు­లు కే­వ­లం 0.3% నుం­చి 0.4% మా­త్ర­మే ఉన్నా­రు. మి­చె­ల్‌ వ్యా­ఖ్య­ల­పై భా­ర­తీయ వృ­త్తి ని­పు­ణుల నుం­చి, ఇమ్మి­గ్రే­ష­న్ మద్ద­తు­దా­రుల నుం­చి తీ­వ్ర వ్య­తి­రే­కత వ్య­క్త­మ­వు­తోం­ది. అత్యంత చదు­వు­కు­న్న, ఎక్కువ పన్ను­లు చె­ల్లిం­చే మరి­యు శాం­తి­యు­తం­గా ఉండే వల­స­దా­రుల సమూ­హా­న్ని లక్ష్యం­గా చే­సు­కో­వ­డం "అమె­రి­కా ప్ర­స్తుత పని­చే­య­ని స్థి­తి­కి ప్ర­తి­రూ­పం" అని కొం­ద­రు మే­ధా­వు­లు మం­డి­ప­డ్డా­రు. ఈ వి­ద్వే­ష­పూ­రిత వ్యా­ఖ్య­లు అమె­రి­క­న్ రా­జ­కీ­యా­ల­లో వలస వి­ధా­నం మరి­యు నై­పు­ణ్యం కలి­గిన వల­స­దా­రుల పా­త్ర­పై జరు­గు­తు­న్న చర్చ­ను మరింత తీ­వ్ర­త­రం చే­స్తు­న్నా­యి.

ట్రంప్ వ్యూహం.. కీలక స్థానంలో భారత్

అమె­రి­కా అధ్య­క్షు­డు డొ­నా­ల్డ్ ట్రం­ప్ ప్ర­పంచ రా­జ­కీ­యా­ల్లో కీలక మా­ర్పు­ల­కు శ్రీ­కా­రం చు­ట్టే ఆలో­చ­న­లో ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ప్ర­స్తు­తం యూ­ర­ప్ ఆధి­ప­త్యం­లో ఉన్న జీ7 కూ­ట­మి­ని పక్క­న­పె­ట్టి, దాని స్థా­నం­లో 'సీ5' (కోర్ ఫైవ్) పే­రు­తో ఓ కొ­త్త శక్తి­వం­త­మైన కూ­ట­మి­ని ఏర్పా­టు చే­యా­ల­ని ఆయన భా­వి­స్తు­న్న­ట్లు సమా­చా­రం. ఈ కూ­ట­మి­లో అమె­రి­కా, రష్యా, చైనా, జపా­న్‌­తో పాటు భా­ర­త్‌­కు కూడా కీలక స్థా­నం కల్పిం­చా­ల­ని యో­చి­స్తు­న్న­ట్లు అమె­రి­క­న్ మీ­డి­యా సం­స్థ 'పొ­లి­టి­కో' పే­ర్కొం­ది. గత­వా­రం వై­ట్‌­హౌ­స్ వి­డు­దల చే­సిన జా­తీయ భద్ర­తా వ్యూ­హా­ని­కి సం­బం­ధిం­చిన ప్ర­చు­రిం­చ­ని రహ­స్య పత్రం­లో ఈ 'సీ5' ప్ర­తి­పా­దన ఉన్న­ట్లు ఆ కథనం పే­ర్కొం­ది. సంపద, ప్ర­జా­స్వా­మ్య పాలన వంటి జీ7 ని­బం­ధ­న­ల­తో సం­బం­ధం లే­కుం­డా, ప్ర­పం­చం­లో­ని ప్ర­ధాన సై­నిక, ఆర్థిక, జనా­భా శక్తి­గా ఉన్న దే­శా­ల­తో ఈ కొ­త్త కూ­ట­మి­ని ఏర్పా­టు చే­యా­ల­న్న­ది .

Tags:    

Similar News