Trump-PM Modi: 12న అమెరికాకు ప్రధాని మోదీ.. 13న ట్రంప్‌తో భేటీ
ఈనెలలో ఫ్రాన్స్, అమెరికా టూర్‌కు మోడీ;
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన రెండు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. రెండు రోజుల పారిస్ పర్యటనను ముగించుకుని అటు నుంచి అటే మోదీ అమెరికాకు వెళ్తారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరు దేశాల దౌత్యవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెలలో ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోడీ భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్‌తో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. తొలి విడత పాలనలో ట్రంప్.. భారత్ పర్యటనలకు వచ్చారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. అంతేకాకుండా ట్రంప్-భారత్‌కు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మోడీ భేటీపై ఆసక్తి నెలకొంది.