Uttar Pradesh: నిద్రలో ఉన్న డ్యూటీ డాక్టర్.. రక్తస్రావంతో మరణించిన రోగి

డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యులు నిద్రపోతున్నారు. చాలా సేపు నొప్పితో ఏడుస్తూ ప్రాణాలు కోల్పోయాడని రోగి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.;

Update: 2025-07-29 09:24 GMT

డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యులు నిద్రపోతున్నారు. చాలా సేపు నొప్పితో ఏడుస్తూ ప్రాణాలు కోల్పోయాడని రోగి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని ఒక ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి రక్తస్రావంతో ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో వైద్యులు నిద్రపోతు న్నారు. డ్యూటీ డాక్టర్లు సకాలంలో స్పందించకపోవడం వల్లనే తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల్లో వైద్యులు నిద్ర పోతున్న  వీడియోలు రికార్డయ్యాయి. వీడియో వైరల్ కావడంతో, ఇద్దరు జూనియర్ డాక్టర్లను సస్పెండ్ చేశారు.

సోమవారం సాయంత్రం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సునీల్ అనే వ్యక్తిని పోలీసులు లాలా లజపతి రాయ్ మెమోరియల్ (LLRM) మెడికల్ కాలేజీకి తీసుకువచ్చారు. అత్యవసర వార్డులో చేర్చినప్పుడు సునీల్ కి రక్తస్రావం అవుతోందని బంధువులు తెలిపారు. 

సునీల్ స్ట్రెచర్ మీద చాలా సేపు నొప్పితో బాధపడుతున్నాడు. మరోపక్క తీవ్ర రక్తస్రావం అవుతోంది. డ్యూటీలో ఉన్న ఇద్దరు జూనియర్ డాక్టర్లు భూపేశ్ కుమార్ రాయ్, అనికేత్ వెంటనే చికిత్స అందించలేదు. వాళ్లు నిద్రపోతున్నారని సునీల్ కుటుంబం ఆరోపిస్తోంది.

సంఘటన జరిగిన సమయంలో డ్యూటీ-ఇన్‌చార్జ్ డాక్టర్ శశాంక్ జిందాల్ ఆసుపత్రిలో లేరు. అయితే, దర్యాప్తు సమయంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదుల గురించి తెలుసుకున్న వెంటనే, తాను ఆసుపత్రికి వచ్చి రోగికి ఇంట్రావీనస్ (IV) ద్రవం మరియు కాస్ట్‌తో సహా తక్షణ చికిత్స అందించానని డాక్టర్ జిందాల్ చెప్పారు.

ఈ ఉదయం 7 గంటలకు సునీల్ మరణించాడు. చికిత్స ఆలస్యమవడమే అతని మరణానికి కారణమని కుటుంబం ఆరోపించింది. అయితే, రోగి పరిస్థితి అప్పటికే విషమంగా ఉందని డాక్టర్ జిందాల్ చెప్పారు.

"ఒక రోగి ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చినప్పుడు జూనియర్ డాక్టర్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. దీంతో సకాలంలో స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం ఇద్దరు వైద్యులను విధుల నుండి సస్పెండ్ చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది" అని LLRM మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ RC గుప్తా అన్నారు. 

Tags:    

Similar News