Uttarakhand: బద్రీనాథ్ రహదారి మూసివేత
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో భారీ వర్షాలు.... బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేత... రాళ్లు, మట్టితో నిండిపోయిన రోడ్డు....;
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడ్డ కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిని 13 గంటలుగా అధికారులు మూసేశారు. బద్రీనాథ్ జాతీయ రహదారి పెద్దఎత్తున రాళ్లు, మట్టితో నిండిపోయింది. పర్యవసానంగా బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్‌కు వెళ్తున్న యాత్రికులు వారి వాహనాలతో సహా చిక్కుకుపోయారు. యాత్రికులను పాండుకేశ్వర్, చమోలి, పిపల్కోటి ప్రాంతాల్లో నిలిపివేశారు. రహదారిని మూసేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. రహదారిపై పేరుకున్న రాళ్లను వీలైనంత త్వరగా తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లుఅధికారులు తెలిపారు. ఇటీవల తరచుగా కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై పలుమార్లు రాకపోకలు నిలిచిపోయాయి.