YEAR END: భారత చరిత్రలో నిర్ణయాత్మక అధ్యాయం
2025 భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక అధ్యాయం
2025 భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఒక నిర్ణయాత్మక అధ్యాయంగా నిలిచింది. రైలు, రోడ్డు, విమానయానం, సముద్ర మార్గం, డిజిటల్ మౌలిక సదుపాయాలలో ప్రతి దశలోనూ ఈ సంవత్సరం భారతదేశ అభిలాషలు వాస్తవికతగా మారాయి. దేశంలోని అత్యంత దూర ప్రాంతాల నుంచి పెద్ద నగర కేంద్రాల వరకు కనెక్టివిటీ లోతుగా పెరిగింది, దూరాలు తగ్గాయి, ప్రజల ఆకాంక్షలకు ఇసుక, సిమెంట్, రైలు పట్టాలు ఆధారమయ్యాయి. ఆర్థిక సంవత్సరం 2025-26లో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం రూ. 11.21 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయించింది, ఇది దేశ GDPలో 3.1 శాతానికి సమానం. అయితే 2047 వరకు భారతదేశం ప్రతి 12-18 నెలలకు $1 ట్రిలియన్ GDPను జోడించే అంచనా ఉంది. ఇది మౌలిక సదుపాయాలు ఆర్థిక వృద్ధికి గుణకారంగా మారింది. అలాగే 2025 ఆ గుణంకాలు కనిపించే ఫలితాలను ఇచ్చింది.
రోడ్లు, హైవేల నిర్మాణం
రహదారుల నిర్మాణంలో భారత్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఆరేళ్లలో 14,000 కిలోమీరట్లకు పైగా రహదారులను నిర్మించింది. దేశంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ పొడవు మార్చి 2019లో 1,32,499 కి.మీ నుంచి ప్రస్తుతం 1,46,560 కి.మీకి పెరిగింది. 4-లేన్, అంతకంటే ఎక్కువ NH నెట్‌వర్క్ పొడవు 2019లో 31,066 కి.మీ నుంచి 43,512 కి.మీకి 1.4 రెట్లు పెరిగింది. ఇది అభివృద్ధి వేగాన్ని పెంచింది.
మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్
భారత్ ప్రపంచలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ నిలించింది. ఒక్క ఏడాదిలోనే దేశంలో 700 కిలో మీటర్లకుపై మెట్రో నెట్‌వర్క్ విస్తరించింది. 2014లో 248 కి.మీ నుంచి 2025లో 1,013 కి.మీకి పెరిగింది. భారత్ ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా గర్వంగా చెప్పుకుంటుంది. ఇది నగర ట్రాన్జిట్ విస్తరణలో తన వేగవంతమైన అడుగులను ప్రతిబింబిస్తుంది. మిజోరంలో మొదటిసారి జాతీయ రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసి చరిత్ర సృష్టించబడింది. మిజోరం చివరకు భారత జాతీయ రైల్వే నెట్‌వర్క్‌లో భాగమైంది, ఇది ఈశాన్య భారత్‌కు మార్పు ఒక మైలురాయిగా నిలిచింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలను నెరవేర్చింది. ఈ విజయంతో మిజోరం భారత రైల్వే మ్యాప్‌లో చేరింది. 51 కిలోమీటర్ల బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్, రూ.8,000 కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వం నిర్మించింది.
అయిజాల్‌ను స్వాతంత్ర్య భారత చరిత్రలో మొదటిసారి జాతీయ రైల్వే నెట్‌వర్క్‌కు నేరుగా అనుసంధానం చేసింది. అత్యవసర సేవలు, సైనిక లాజిస్టిక్స్, పౌర ఆరోగ్య సేవలు, విద్య, ఉపాధి అవకాశాలు – మిజోరం జనాభాకు ఒకే రైల్వే లైన్‌తో పూర్తిగా మార్పు చెందాయి.
దేశంలోనే తొలి ర్టికల్ లిఫ్ట్ సముద్ర బ్రిడ్జ్
2025లో భారత్ మౌలిక సదుపాయాల కథ సముద్రాలకు కూడా చేరింది. దేశంలోనే మొదటి సారిగా ప్రభుత్వం వర్టికల్ లిఫ్ట్ సముద్ర బ్రిడ్జ్ ను నిర్మించింది. ఇది సాంకేతిక పురోగతి, ప్రత్యేక డిజైన్‌లకు ప్రసిద్ధి చెందింది. అదునిక రామసేతుగా పిలువబడే ఈ పాంబన్ బ్రిడ్జ్‌ను రామనవమి సందర్భంగా ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.