Yogi Adityanath: నేడు ఢిల్లీకి యోగి ఆదిత్యనాథ్.. మంత్రవర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ..

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.

Update: 2022-03-11 11:15 GMT

Yogi Adityanath (tv5news.in)

Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. యూపీలో బీజేపీ రెండవ దఫా భారీ మెజార్టీతో విజయం సాధించడంతో.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా సీఎం రాజధాని వెళనున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పార్టీ అగ్రనేతలతో యోగి చర్చించనున్నారు. ఈ పర్యటనలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. పార్టీ చీఫ్‌ జేపీ నడ్డాతోపాటు పలువురు కేంద్రమంత్రులనుకలిసి ప్రభుత్వ కూర్పు, మంత్రివర్గ విస్తరణపై కూలంకుషంగా చర్చించనున్నారు.

రెండవ సారి అధికారం చేపట్టనున్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. తన కొత్తకేబినెట్‌ ప్రస్తుతం ఉన్న మంత్రులు ఎవరెవరు కొనసాగించడం.. కొత్తగా ఎవరికి పదవులు కట్టబెట్టాలనే విషయాన్ని పార్టీ పెద్దల సూచనల మేరకు నిర్ణయించనునారు. ఎన్నికలకు ముందు కొంతమంది మంత్రులు.. ఎమ్మెల్యేలు పార్టీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్లడంతో అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి.

ఆస్థానంలో కొత్తగా పలువురు అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే కొత్తగా ఎన్నికైన వారిలో ఎవరెవరికి కేబినెట్‌లో భాగస్వామ్యం చేయాలా వద్దా అనేది కూడా చర్చించనున్నారు. 2017లో జరిగిన ఎన్నికల కంటే ఈ దఫా కొన్ని సీట్లు తగ్గినప్పటికీ బీజేపీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఎమ్మెల్యేల స్థానాలను కైవసం చేసుకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్‌పీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ రెండు పార్టీలు గతంలో కంటే అత్యంత తక్కువ సీట్లకే పరిమితమయ్యాయి. జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెస్ ఇది ఘోర పరాభవంగా చెప్పవచ్చు. ఈ దఫా యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సమాజ్ వాదీ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. వాటిపై కమలనాధులు గండికొట్టారు. అయితే గతంలో కంటే అధిక సీట్లను సమాజ్‌ వాదీ కైవసం చేసుకోవడం విశేషం. ఇతర పార్టీలతో సమాజ్ వాదీ పార్టీ పెట్టుకున్న పొత్తులు పెద్దగా ఫలించలేక పోయాయి. 

Tags:    

Similar News