ఇజ్రాయెల్‌ బాట పడుతున్న యూపీ యువత

జాబ్‌ కోసం సంక్షోభ పరిస్థితుల్లోకి..

Update: 2024-12-05 02:00 GMT

ఏడాదికాలంగా యుద్ధంలో కూరుకుపోయిన ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు ప్రపంచ దేశాల ప్రజలు ధైర్యం చేయడం లేదు. అయితే, మన దేశంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు మాత్రం సంక్షోభంలో ఉన్న దేశాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఇజ్రాయెల్‌లో వివిధ రంగాల కార్మికులకు తీవ్ర కొరత ఉంది. పాలస్తీనా నుంచి వచ్చే కార్మికులపై ఆంక్షలతో కొరత మరింత పెరిగింది. దీంతో ఆ దేశ పాపులేషన్‌, ఇమిగ్రేషన్‌ అండ్‌ బార్డర్‌ అథారిటీ(పీఐబీఏ), భారత నేషనల్‌ స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ) కలిసి యూపీలో రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించాయి.

నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 3 వరకు జరిగిన నియామక కార్యక్రమానికి వందలాదిగా యువకులు హాజరయ్యారు. వీరంతా ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి కోర్సులు చదివిన వారే. యూపీలో నిరుద్యోగం తీవ్రంగా ఉండటం, ఏదైనా పని దొరికినా చాలీచాలని వేతనం కారణంగానే ఇజ్రాయెల్‌ వెళ్లాలని అనుకుంటున్నట్టు యువకులు చెప్తున్నారు. ఇక్కడ రోజుకు రూ.500 దొరకడం కూడా కష్టమేనని, ఇజ్రాయెల్‌లో నెలకు రూ.1.37 లక్షల నుంచి రూ.1.92 లక్షల వరకు వేతనం వస్తున్నదని, అందుకే యుద్ధం జరుగుతుందని తెలిసినా వెళ్తున్నామని అంటున్నారు.

Tags:    

Similar News