PR Sreejesh: భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం
అతడి జెర్సీ నెం.16ని రిటైర్ చేసిన హాకీ ఇండియా;
భారత హాకీ జట్టు గోల్ కీపర్, ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన టీమిండియా హాకీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అతడి జెర్సీ నెం.16ని రిటైర్ చేస్తున్నట్లు ఇండియా హాకీ బుధవారం ప్రకటించింది. జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలకుగాను హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, పారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టు కాంస్యం సాధించడంలో గోల్ కీపర్ గా శ్రీజేశ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా వరుసగా రెండో ఒలింపిక్స్ మెడల్‌ను ముద్దాడింది. ఇక ఈ విశ్వ క్రీడలతోనే తన అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికాడు ఈ హాకీ లెజెండ్. “పీఆర్ శ్రీజేశ్ ఉపయోగించిన నంబర్ 16 జెర్సీ ఇప్పుడు రిటైర్ అవుతుంది. ఇది సీనియర్ జట్టు కోసం తీసుకున్న నిర్ణయం. జూనియర్ల కోసం జెర్సీ ఉంటుంది. ఎందుకంటే శ్రీజేశ్ తదుపరి శ్రీజేశ్‌ను తీర్చిదిద్దాలని వారు కోరుకుంటున్నారు” అని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ అన్నారు.
తన సుదీర్ఘ కెరీర్‌ను ముగించిన శ్రీజేష్.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అన్నదానికి సమాధానం దొరికింది. శ్రీజేష్... టీమిండియా హాకీ జట్టు కోచ్‌గా మారాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. టీమిండియా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ టీమిండియా క్రికెట్ కోచ్‌గా మారినట్లే... హాకీ దిగ్గజ ఆటగాడు శ్రీజేష్ కూడా భారత హాకీ జట్టు కోచ్‌గా మారాలని సంకల్పించుకున్నాడు.