అవార్డుల ప్రధానోత్సవానికి దూరంగా భారత అగ్రశ్రేణి రెజ్లర్
భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కోవిడ్–19 బారిన పడింది..;
భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కరోనా బారిన పడ్దారు. నిన్న నిర్వహించిన కరోనా పరీక్షలో తనకు 'పాజిటివ్'గా నిర్ధారణ అయినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. వినేశ్ ఫొగాట్ ఇటీవలే 'రాజీవ్ ఖేల్‌రత్' అవార్డుకు ఎంపికయ్యారు... వర్చువల్ పద్ధతిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె దూరం అయ్యారు. అవార్డుల కోసం జరుగుతున్న రిహార్సల్స్‌కు ముందే సోనేపట్‌లో ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న వినేశ్, త్వరలోనే కోలుకుంటానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.