అసమానతలు లేని సమాజం చూడాలన్నదే అంబేడ్కర్ కల అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన కలలు గన్న నిర్మాణం జరగలేదని తెలిపారు. దళిత సీఎం హామీ ఇచ్చి మాట తప్పడం తెలంగాణ రాష్ట్రంలోనే తొలి ఉల్లంఘన అని విమర్శించారు. కేబినెట్‌లో ఉన్న దళిత డిప్యూటీ సీఎంని సాకులు చెప్పి తీసేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దళితులకు తెలంగాణలో అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయని అన్నారు.