హైదరాబాద్‌లో మామిడి పండ్ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. కిలో వంద నుంచి రెండు వందలు పలుకుతున్నాయి. గతేడాదితో పోల్చితే 40 శాతం మామిడి దిగుబడి తగ్గింది. అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. గతేడాది కిలో 50 రూపాయల లోపే ఉండే ధరలు.. ఈసారి సెంచరీ దాటేశాయి. ఇక.. పండ్ల మార్కెట్ నగర శివారులోని బాటసింగారానికి వెళ్లడం.. ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు పెరిగి.. సామాన్యుడు మామిడి పండ్లు తినే పరిస్థితి లేకుండా పోయింది.