తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై.. ఎంపీ అవినాష్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా సీబీఐ అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు. కీలక విషయాలను సీబీఐ విస్మరిస్తోందని ఆరోపించారు. సమాచారం దాచిన వివేకా అల్లుడు రాజశేఖర్‌ను విచారించట్లేదని.. దస్తగిరి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. వాచ్‌మెన్ రంగన్న చెప్పింది కూడా పట్టించుకోలేదన్న ఆయన.. హత్య విషయం తనకన్నా గంట ముందే వివేకా అల్లుడికి తెలుసని పేర్కొన్నారు. వివేకా హత్య విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పింది తానేనని.. సమాచారం ఇచ్చిన తనను దోషి అంటున్నారన్నారు. నిజాయితీ నిరూపించుకుంటామని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు.