డీఎస్పీపై జేసీ గరమ్ గరమ్...
శాంతిభద్రతలు లోపిస్తోంది అతనివల్లేనంటూ మండిపాటు;
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య వల్లే శాంతిభద్రతలు లోపిస్తున్నాయని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకి డీఎస్పీ తొత్తుగా మారి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. కావాలనే టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని విమర్శించారు. మహిళలపైనా కేసులు నమోదు చేసిన ఘనుడు డీఎస్పీ అని మండిపడ్డారు. తన ఇంటిలోకి వచ్చి తనను వేధించారని.. ఇకపై తన ఇంట్లోకి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. చేతికి ఏది దొరికితే దాంతోనే తిరగబడతామని తేల్చిచెప్పారు.